అక్షర-ఆకృతీకరణ ట్యాగ్‌లు (Character -formatting Tags):
వీటిని ఉపయోగనుంచి ఒక అక్షరం మొదలుకొని ఒక పేరా వరకు మీకు నచ్చిన విధంగా
ప్రదర్శించవచ్చు. అందులో కొన్ని:
బోల్డ్ ట్యాగ్ (bold tag):
ఈ టాగ్ అక్షరాలను బాగా మందంగా చేసి చూపిస్తుంది. దీని నిర్మాణం ఎలా ఉంటుందంటే :
<b> ... </b>
ఇటాలిక్ ట్యాగ్ (italic tag):
ఈ టాగ్ అక్షరాలను 45 డిగ్రీల కోణంలో వంచి ప్రదర్శిస్తుంది. దీనిని ముఖ్యంగా ప్రాముఖ్యత లేదా వ్యత్యాసం మరియు విదేశీ పదాలను ముద్రించడానికి లేదా ప్రదర్శించడానికి ఉపయోగిస్తారు. దీని నిర్మాణం ఎలా ఉంటుందంటే :
<i> ... </i>
ఉదాహరణకు :
<i>This text is in italics.</i>
అండర్లైన్ ట్యాగ్ (underline tag):
మీరు ఏదైనా ఒక పదం క్రింద గాని లేదా ఒక వాక్యం క్రింద గాని గీత గీయడానికి ఉపయోపడుతుంది. దీని నిర్మాణం ఎలా ఉంటుందంటే :
<u> ... </u>
ఉదాహరణకు :
Here some <u>underlined</u> text.
అధిక టాగ్ (big tag):
మిగిలిన వాటితో పోలిస్తే మీరు ఎంచుకున్న పదాలను లేదా వాక్యాలను పెద్దవిగా చేసి చూపిస్తుంది. దీని నిర్మాణం ఎలా ఉంటుందంటే :
<big> ... </big>
ఉదాహరణకు :
This sentence has some <big>bigger text</big> in it.
అల్ప టాగ్ (small tag):
మిగిలిన వాటితో పోలిస్తే మీరు ఎంచుకున్న పదాలను లేదా వాక్యాలను చిన్నవిగా చేసి చూపిస్తుంది. దీని నిర్మాణం ఎలా ఉంటుందంటే :
<small> ... </small>
ఉదాహరణకు :
This sentence has some <smaller> smaller text </smaller> in it.
స్ట్రాంగ్ టాగ్ (strong tag) :
ఈ ట్యాగ్ ఎల్లప్పుడూ ఒక పదాన్ని లేదా వాక్యాన్ని నొక్కి చెప్పడానికి ఉపయోగించబడుతుంది. <b> టాగ్ మరియు <strong> టాగ్ ఒకేలా ప్రవర్తిస్తాయి. దీని నిర్మాణం ఎలా ఉంటుందంటే :
<strong> ... </strong>
ఉదాహరణకు :
<p>This is <strong>important</strong> text.</p>
ఉప టాగ్ (sub tag): ఒక అక్షరాన్ని లేదా ఒక పదాన్ని గీతకు దిగువన ముద్రిస్తుంది.
<sub> ... </sub>
ఉదాహరణకు :
The following is <sub> subscript </sub>.
ఉన్నత టాగ్ (sup tag): ఒక అక్షరాన్ని లేదా ఒక పదాన్ని గీతకు ఎగువన ముద్రిస్తుంది. దీని నిర్మాణం ఎలా ఉంటుందంటే :
<sup> ... </sup>
ఉదాహరణకు :
The following is <sup> superscript </sup>.
మార్క్ ట్యాగ్ (mark tag):
మార్క్ ట్యాగ్ ఒక పదాన్ని ప్రకాశవంతమైన పసుపు రంగులో కనిపించేలా చేస్తుంది. దీని నిర్మాణం ఎలా ఉంటుందంటే :
<mark> ... </mark>
ఉదాహరణకు :
The mark tag is <mark> useful </mark> when you want to highlight some text.
ctags.html:
<html>
<head></head>
<body>
<p>This is <b>bold text</b>.</p>
<p>This is <u>underlined </u> text.</p>
<p><strong>Warning!</strong> Please proceed with caution.</p>
<p>This is <i>italic text</i>.</p>
<p>This is <em>emphasized text</em>.</p>
<p>This is <mark>highlighted text</mark>.</p>
<p>This is <code>computer code</code>.</p>
<p>This is <small>smaller </small> text.</p>
<p>This is <big>bigger </big> text.</p>
<p>This is the 16<sup>th</sup> day of the month.</p>
<p>Water tanks are clearly marked as H<sub>2</sub>O.</p>
<p>Peter <del>are</del> <ins>is</ins> correct, the proposal from Acme is lacking a few <del>minor </del>details.</p>
</body>
</html>
Output:
0 Comments